AKP: ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సూచించారు. రాంబిల్లి మండలం మామిడివాడలో ఆదివారం నియోజకవర్గం సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు.