NZB: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. కుటుంబాలు, స్నేహితులతో వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్ అందాలను ఆస్వాదించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల పచ్చదనం, చల్లని గాలులు, నీటి అలల చప్పుళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.