బీహార్లో జరగనున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రచారంలో చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కాగా, ఇప్పటికే 121 స్థానాలకు సంబంధించిన తొలి విడత పోలింగ్ పూర్తయింది.