సౌతాఫ్రికా ‘A’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘A’ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో భారత్ ‘A’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 255, రెండో ఇన్నింగ్స్లో 382/7D పరుగులు చేసింది. సౌతాఫ్రికా-A తొలి ఇన్నింగ్స్లో 221 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 417/5 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.