VZM: వేపాడ మండలం మారిక గ్రామంలో ఆదాన్ యాజమాన్యం నిర్మించనున్న హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివారం వేపాడ మండల కేంద్రంలో మారిక గిరిజనులతో కలసి నిరసన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.