SKLM: ఆమదాలవలస మండలం గాజులు కొలివలస గ్రామం వద్ద ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా సైకత శిల్పి గేదెల హరికృష్ణ శివపార్వతీ స్వరూపమైన అర్ధనారీశ్వర సైకత శిల్పాన్ని ఇసుకతో ఆదివారం రూపొందించారు. సోమవారం రోజున స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.