CTR: తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ పింఛన్ దారులు కోరారు. ఇందులో భాగంగా సదుంలో ప్రభుత్వ పింఛనుదారులు ఆదివారం సమావేశం నిర్వహించారు. మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు చాలా బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య సేవల కోసం ప్రతినెల రూ. 300 చెల్లిస్తున్నా సక్రమమైన సేవలు అందించడం లేదన్నారు.