BDK: జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు. భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం RDO కార్యాలయానికి వెళ్లాలన్నారు.