కృష్ణా: చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన విమర్శలను ఖండించారు. వైసీపీ పాలనలో కోడూరు రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాటలు చెప్పకుండా చేసి చూపించడమే బుద్ధప్రసాద్ విధానమన్నారు.