MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 17వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ను ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సెంటర్ స్థానిక ప్రజలకు, రైతులకు మరమ్మతుల విషయంలో ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.