CTR: వీ.కోట మండల తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా వీ.కోట మండల కేంద్రంలోని పీఎంఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం TDP బలోపేతానికి కొత్త కార్యవర్గం కృషి చేయాలన్నారు.