SKLM: కార్తీక మాసం ఆదివారం సందర్భంగా గార మొగదలపాడు బీచ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే కుటుంబ సభ్యులు, స్నేహితులతో పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్‌కు తరలివచ్చారు. ప్రజల రద్దీ దృష్ట్యా కళింగపట్నం మేరైన్ సీఐ ప్రసాదరావు, గార ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్రంలో లోతుగా వెళ్లరాదని సందర్శకులకు హెచ్చరికలు జారీ చేశారు.