TG: బీఆర్ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. పదేళ్లలో చేయని పనులు బీఆర్ఎస్ చేస్తామంటోందని తెలిపారు. మరోసారి ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు. ఈ రెండుపార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. డబ్బులు పంచగానే ఓట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు అనుకుంటే అది భ్రమ అని పేర్కొన్నారు.