GNTR: తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర గ్రామంలో ఆదివారం గంగానమ్మ తల్లి కొలుపుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల మధ్య మంత్రి తల్లి గంగానమ్మను దర్శించుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.