CTR: పుంగనూరులో మైనారిటీ జూనియర్ కళాశాల స్థాపనకు కృషి చేస్తానని నియోజకవర్గ TDP ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు మైనారిటీ నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, ఇటీవల నిర్మించిన మసీద్‌కు పొజిషన్ ధ్రువపత్రాన్ని అందజేశారు. కళాశాల ఏర్పాటు విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యాభివృద్ధికి TDP కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.