సత్యసాయి: చిలమత్తూరు మండలం కోడికొండ గ్రామ పంచాయతీలో ఆదివారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకుడు వేణురెడ్డి పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. 2029లో వైసీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని అన్నారు. గ్రామపంచాయతీలో గ్రామ కమిటీ అనుమతి లేకుండా ఏ పని జరగదు అని తెలిపారు.