BPT: పట్టణ సీఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి ఆదివారం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా సూర్యలంక బీచ్‌కి వెళ్లే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరూ అధిక వేగంతో వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు.