CTR: శ్రీరంగరాజపురం మండలంలోని పిల్లారీ కుప్పం పంచాయతీకి చెందిన సుమారు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని విడిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, నియోజకవర్గ సమన్వయకర్త కృపా లక్ష్మి, మంగుంట సర్పంచ్ శేషాద్రి రెడ్డి ఆధ్వర్యంలో వారికి కండువ కప్పి పార్టీకి ఆహ్వానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.