KNR: కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో గన్నేరువరంలోని ప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 108 శివలింగాలు, జంట నాగులకు జలాభిషేకాలు నిర్వహించి, దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించింది. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.