HNK: మద్యం మత్తులో అల్లుడు అత్తపై దాడి చేసిన ఘటన ఇవాళ ఐనవోలు మండలంలోని రెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాపోల్ బిములు కూతురు మానసకు గండికోట బాలస్వామితో వివాహం చేశాడు. అదనపు కట్నం కోసం బాలస్వామి మానసను వేధించేవాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో అత్తమామలు భార్యతో గొడవపడి అడ్డుకోబోయిన అత్త ఐలమ్మపై ట్రాక్టర్ను ఆమె పైకి ఎక్కించాడు. దీంతో ఐలమ్మకు కాలికి బలమైన గాయాలయ్యాయి.