కృష్ణా: గుంటకోడూరు గ్రామంలో రైల్వే స్టేషన్ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం గుడివాడ జనసేన ఇంఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నేత జగన్మోహన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణం రూ.8.50 లక్షల వ్యయంతో చేపట్టారన్నారు. గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.