VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేసింది. ఈ క్రమంలో స్థానిక వ్యక్తి గుర్తించి చిన్నారిని కాపాడే యత్నం చేయగా అతనిపై కూడా దాడికి పాల్పడింది. చిన్నారి కిరాణా దుకాణాకి నడిచి వెళ్తుండగా వెంటపడి తొడను కరిచినట్లు స్థానికులు తెలిపారు.. పట్టణంలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్న పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.