JGL: తండ్రిపై కొడుకు దాడి చేసిన ఘటన మెట్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బోయవాడలో ఆదివారం ఎల్లా గంగా నర్సయ్యపై అతని కొడుకు అన్వేష్ కత్తితో దాడి చేశాడు. దాడిలో నర్సయ్యకు తీవ్ర గాయాలు కాగా, అతనిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.