NDL: రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఇవాళ బనగానపల్లెలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు నిండిన ప్రజలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైసీపీ ముందుకెళ్తుందని అన్నారు.