NZB: లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.