E.G: జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్జరం నుంచి కొవ్వూరు వైపు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్, గోతుల రోడ్డులో వెళ్తుండగా కుదుపులకు గురై ట్యాంకర్ నుంచి యాసిడ్ లీక్ అయింది.ఈ ప్రమాదంలో అటు నుంచి బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.