KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని మత్స్య గిరింద్ర స్వామి ఆలయంలో 2026 బ్రహ్మోత్సవాల కోసం పూజా సామాగ్రి టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం ఏడాది పాటు సామాగ్రి సరఫరాకు ఆలయ చైర్మన్ కోరం రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల సమావేశంలో తీర్మానం చేశారు. భక్తుల రద్దీ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజిరెడ్డి తెలిపారు.