బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సమస్తీపుర్ జిల్లాలో రోడ్డుపక్కన వీవీప్యాట్ స్లిప్పులు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సహాయ రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించాలంటూ జిల్లా మేజిస్ట్రేట్‌ను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించారు.