GNTR: మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. సత్తెనపల్లి వైపు నుంచి పేరేచర్ల దిశగా వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.