ELR: కైకలూరులోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆదివారం ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ను ఆవిష్కరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసనను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా నవంబర్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, ఎమ్మార్వోలకు వినతి పత్రం అందజేస్తామన్నారు.