CTR: బంగారుపాళ్యం మండలం ముంగరమడుగు పంచాయతీలో ఆదివారం ర్యాలీ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం గ్రామస్థులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ప్రజా ఉద్యమానికి తమ మద్దతు తెలియజేశారు.