TG: రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని HYD సీపీ సజ్జనార్ అన్నారు. డబ్బులు ఊరికే రావని.. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు రకాల యాప్స్, APK ఫైల్స్ వల్ల కూడా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు నష్టపోయిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.