SGR: జిల్లా స్థాయి ఖోఖో సెలక్షన్స్ ఈ నెల 11,12 తేదీల్లో సంగారెడ్డిలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ మైదానంలో జరుగుతాయని స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బాలబాలికల అండర్-14, అండర్-17 విభాగాలకు ఎంపికలు జరుగుతాయి. 11న బాలురకు,12న బాలికలకు ఎంపికలు ఉంటాయని చెప్పారు. 28 మండలాల నుంచి ఎంపికైన విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.