VSP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. అధికారులు అర్జీలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.