TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో ముఖ్యమంత్రి అయ్యే రేఖ లేదని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. దశ లేని వాడికి దిశ మారిస్తే ఏం వస్తుంది? అంటూ ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి, మాగంటి గోపీనాథ్ తల్లికి న్యాయం చేయలేనివాడు కేటీఆర్ అంటూ విమర్శించారు. ధృతరాష్ట్రుడు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.