TG: సీఎం రేవంత్ రెడ్డి, BRS అధినేత KCRకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్రానికి కేంద్రం చేసిన అభివృద్ధి పనులను.. ప్రజల ముందు ఉంచుతాం. BRS, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశామనే ఆరోపణలు అవాస్తవం. ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధం’ అంటూ సవాల్ చేశారు.