మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని షాపు నెంబర్ 34లో రేషన్ డీలర్‌కు బదులు మరో వ్యక్తితో షాపును నిర్వహించడం పట్ల రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పలు రేషన్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్ నెంబర్ 34 రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని షో కాజ్ నోటీసుజారీ చేయాలని అధికారులను ఆదేశించారు.