TG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతితో సాహితిలోకం కన్నీటి సంద్రంలో మునిగిందని అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన పాటలు కీలకమని కొనియాడారు.