ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నిన్న శ్రీ సద్గురు నాసర్ భగవాన్ 25వ వార్షిక గంధ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, ముక్కు చిన్న నర్సారెడ్డి నాసర్ భగవాన్ దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యల తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు స్వామి వారి వ్రసాదాలు పంపిణీ చేశారు.