WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల 19 వరకు చలి తీవ్రంగా పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాలో 11-14 డిగ్రీలు, మహబూబాబాద్‌లో 14-17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.