KMM: వినియోగదారుల కమిషన్, వాహన సమస్యలను పరిష్కరించడంలో వినియోగదారుడిని ఇబ్బంది పెట్టినందుకుగాను టీవీఎస్ ద్విచక్ర వాహనాల కంపెనీకి రూ. 60 వేల జరిమానా విధించింది. ఖమ్మంకు చెందిన రామిశెట్టి నితిన్ విజేత ఫిర్యాదు మేరకు ఈ తీర్పు వెలువడింది. వాహనాన్ని సరిచేయడంతో పాటు, రూ. 50 వేల జరిమానా, మానసిక వేదనకు మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 60 చెల్లించాలని ఆదేశించింది.