KRNL: దేవనకొండ(M) తెర్నేకల్ హంద్రీ వాగులో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్థులు కోరారు. గోనెగండ్ల (M) బైలుప్పల, అగ్రహారం గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యజమానులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇసుక తరలింపుతో పర్యావరణ పరిరక్షణకు ముప్పు ఏర్పడుతుందని, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు పేర్కొన్నారు.