కార్తీక మాసం ప్రారంభమై ఇవాళ్టికి 20వ రోజు. ఈ రోజు ఎవరైతే మృత్తికా స్నానం ఆచరిస్తారో వాళ్లు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకుని భూ లాభాన్ని, గృహ లాభాన్ని పొందుతారని.. తద్వారా సొంతింటి కల సాకారం చేసుకుంటారని వేదపండితులు చెప్తున్నారు. మృత్తికా స్నానం అంటే పుట్ట దగ్గర కొంత మట్టిని ఇంటికి తెచ్చుకుని కాళ్లు, చేతులకు రాసుకుని ఆ తర్వాత స్నానం చేయాలి.