MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దున్నపోతుల విన్యాసాలను తిలకించారు. సదర్ ఉత్సవాలు యాదవులకు ప్రత్యేక పండుగ లాంటివని ఆయన పేర్కొన్నారు.