ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో ఈనెల 11న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎస్పీ లింగన్నపాలెం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు 750 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు చేపడుతున్నామన్నారు.