AP: రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఉ.11 గంటలకు జరగనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుపై ప్రధానంగా చర్చించనున్నారు. 12వ SIPBలో తీసుకున్న రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. NaBFID నుంచి రూ. 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించనుంది. తుఫాన్ నష్టాలపై పర్యటిస్తున్న కేంద్ర బృందం అంశంపై చర్చ జరగనుంది.