ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం కేంద్ర బృందం రానున్నట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్ర బృందం రానున్నట్లు వారు తెలిపారు. ఈ బృందం తుఫాను వల్ల నష్టం కలిగిన తీరును పరిశీలిస్తారని తెలిపారు. అలాగే కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామాన్ని సందర్శిస్తారన్నారు.