KMR: రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో కాలభైరవ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం బద్ది పోచమ్మ తల్లికి భక్తులు బోనాలను వైభవంగా సమర్పించారు. మహిళలు పలు రకాల బోనాలను అలంకరించి కాలభైరవ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.