BDK: గుండాల మండల కేంద్రానికి చెందిన నాగెల్లి వెంకన్న ఇల్లు ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైందని చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.