ప్రకాశం: జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. ముఖ్య అతిథులుగా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంఛార్జి సత్యేంద్రబాబు పాల్గొంటారన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ సమావేశానికి రావాలని ఆయన కోరారు.